Sharwanand : శ‌ర్వానంద్ హీరోగా అజయ్ భూపతి 'మ‌హాస‌ముద్రం'!

Sharwanand : శ‌ర్వానంద్ హీరోగా అజయ్ భూపతి మ‌హాస‌ముద్రం!
x

Sharwanand 

Highlights

Sharwanand : RX 100 సినిమాతో ఎక్కలేని క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.. ఈ సినిమా తర్వాత చాలా

Sharwanand : RX 100 సినిమాతో ఎక్కలేని క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం మ‌హాస‌ముద్రం అనే సినిమాని చేస్తున్నాడు.. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్‌ ని చిత్రనిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేసింది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజ్ ప్రాజెక్ట్ అని వెల్లడించింది. తెలుగు, త‌మిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ‌ర్వానంద్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాకి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ ని ప్రతివారం ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ముందుగా ఈ సినిమాని రవితేజతో చేయాలనీ అనుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.. కానీ ఏమైందో తెలియదు కానీ అక్కడి నుంచి కథ శర్వానంద్‌కి వెళ్ళింది. ఇందులో శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని సమాచారం..


ఇక ఈ ఏడాది జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ‌ర్వానంద్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. ప్రస్తుతం శ‌ర్వానంద్ మహాసముద్రం సినిమాతో పాటుగా కీరవాణి, శ్రీకారం అనే సినిమాలను చేస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories