Top
logo

శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్, రష్మిక

శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్, రష్మిక
X
Highlights

దసరా సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనం సమయంలో హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నా, దర్శకుడు కిషోర్ తిరుమల మొదలగు వారు స్వామి వారిని దర్శించుకున్నారు.

దసరా సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనం సమయంలో హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నా, దర్శకుడు కిషోర్ తిరుమల మొదలగు వారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్ లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఇక అటు ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం, మహాసముద్రం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక కిషోర్ తిరుమల రామ్ తో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు.

Web TitleHero sharwanand and rashmika mandanna visit tirumala temple
Next Story