Sai Dharam Tej: ఇప్పుడు సాయి తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది?

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించిన అప్డేట్

admin1
Updated on: 28 Oct 2021 5:01 PM IST
Hero Sai Dharam Tej Health Updates
X

హీరో సాయి ధరమ్ తేజ్ (ఫైల్ ఇమేజ్)

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే రోడ్ యాక్సిడెంట్ కి గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు అందరూ ఒక వైపు సాయి తేజ్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని కంగారు పడుతూ ఉండగా మరోవైపు సాయి తేజ కి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటికి రావడం లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా సాయి తేజ్ ఆరోగ్యంపై ట్వీట్స్ చేయడం లేదు. ఈ మధ్యనే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సాయి తేజ్ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేదు కానీ కేవలం ఆయన చేతి ఫోటోని షేర్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన సాయిధరమ్ ఆరోగ్యం గురించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు చాలా బాగా కోలుకుంటున్నారు. కూర్చోగలుగుతున్నారు, అందరితో మాట్లాడగలుగుతున్నారు కూడా. కాకపోతే ఆక్సిడెంట్ తర్వాత సాయి ధరంతేజ్ చాలా తగ్గిపోయారు. గత కొంతకాలంగా సాయితేజ్ బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆక్సిడెంట్ తర్వాత స్పెషల్ డైట్ లో ఉండటం వలన సాయి తేజ్ మరింత సన్నగా అయిపోయారు. అదృష్టవశాత్తు సాయి సాయి తేజ్ మొహం పైన ఎటువంటి గాట్లు పడలేదు. ఒక రోజుకి సాయి తేజ్ కేవలం ఒకరిని మాత్రమే కలుస్తున్నారు. ఇలా రోజూ ఎవరో ఒకరిని కలవడంతో సాయి తేజ్ మాట కూడా నార్మల్ అయిపోయింది. సినిమాలతో బిజీ అయిన సాయి తేజ్ కి చాలా కాలం తర్వాత రిలాక్స్ అయ్యే సమయం కూడా దొరికింది.

admin1

admin1

Next Story