Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల

Sai Dharam Tej: టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు

Sandeep Eggoju
Published on: 11 Sept 2021 10:05 AM IST
Hero Sai Dharam Tej Health Bulletin Released
X

హీరో సాయిధరమ్మ్ తేజ్ హెల్త్ బులిటిన్ (ఫైల్ ఇమేజ్)

Sai Dharam Tej: టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అతడి కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కాలర్‌ బోన్‌ విరిగిందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుండగా మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. ప్రమాదం సమయంలో రహదారిపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి పడినట్టు తెలుస్తోంది. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడని మాదాపూర్ డీసీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇసుక ఉందని. ప్రమాదం జరిగిన కూడా సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడని వివరించారు.

ఈ ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రాత్రి 8:05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్-45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న సమయంలో ఆ రహదారిపై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయ్యింది.ఈ ఘటన గురించి తెలుసుకున్న మెగాభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. మొదట స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోగా అక్కడ్నుంచి అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సాయి ధరమ్‌కు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎప్పటికప్పుడు బులెటిన్‌ను రిలీజ్ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story