Ravi Teja New Movie: గ్యాంగ్ స్టార్ బయోపిక్ లో నటించనున్న రవితేజ

admin1
Published on: 9 Aug 2021 12:06 PM IST
Hero Ravi Teja Signed a New Movie Related to Gangster Biography
X

రవి తేజ (ట్విట్టర్ ఫోటో) 

Ravi Teja New Movie: వరుస డిజాస్టర్ లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఫైనల్ గా "క్రాక్" సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా రవితేజ తన తదుపరి సినిమా "రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరో వైపు రవితేజ దర్శకుడు త్రినాథరావు నక్కిన తో ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మరో వైపు వెంకీ కుడుముల కూడా రవితేజకు స్క్రిప్ట్ వినిపించే పనిలో పడ్డాడు

అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ ఇప్పుడు ఏకంగా ఒక పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఒక నిజ జీవిత పాత్ర ఆధారంగా తెరకెక్కనుంది ఈ సినిమా టైగర్ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా అనుకున్నారు కానీ ఆ తర్వాత చేతులు మారిన ఈ సినిమా ఇప్పుడు రవితేజ చేతుల్లో కి వచ్చింది ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

admin1

admin1

Next Story