హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మిల్క్ బ్యూటీ తమ్మన్నాతో పాటు మరికొందరు కోవిడ్‌ బారిన పడగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సినీ నటుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కూడా చేరారు.

K V D Varma
Published on: 29 Dec 2020 8:13 AM IST
హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
X

గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మిల్క్ బ్యూటీ తమ్మన్నాతో పాటు మరికొందరు కోవిడ్‌ బారిన పడగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సినీ నటుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కూడా చేరారు.

హీరో రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని స్వయంగా చెర్రీ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోంక్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. త్వరలో కోలుకొని అభిమానుల ముందుకు వస్తానని చరణ్‌ ట్వీట్‌ చేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా ఒకసారి టెస్ట్‌ చేయించుకుంటే మంచిదని తన అభిప్రాయాన్ని షేర్‌ చేసుకున్నారు చెర్రీ.

దర్శక ధీర రాజమౌళి డైరెక్షన్‌లో జూ.ఎన్టీఆర్‌తో కలిసి రామ్‌చరణ్‌ ట్రిబుల్‌ ఆర్‌ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే.. ఇప్పుడు చరణ్‌ కరోనా బారిన పడడంతో షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్‌ పడే అవకాశం ఉంది.

K V D Varma

K V D Varma

Next Story