రూ.25 ల‌క్ష‌ల‌ చెక్ ను మంత్రి కేటీఆర్ కి అందజేసిన హీరో రామ్!

రూ.25 ల‌క్ష‌ల‌ చెక్ ను మంత్రి కేటీఆర్ కి అందజేసిన హీరో రామ్!
x
Highlights

కొద్దిరోజులుగా హైదరాబాదులో కురుస్తున్నభారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. ఈ వర్షాల వలన చాలా మంది ప్రజలు నిరాశ్ర‌యులయ్యారు. అలాంటి వారిని ఆదుకోవడం కోసం టాలీవుడ్ పరిశ్రమ ముందుకు వస్తుంది.

కొద్దిరోజులుగా హైదరాబాదులో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. ఈ వర్షాల వలన చాలా మంది ప్రజలు నిరాశ్ర‌యులయ్యారు. అలాంటి వారిని ఆదుకోవడం కోసం టాలీవుడ్ పరిశ్రమ ముందుకు వస్తుంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ మొదలగు స్టార్స్ ముందుకు వచ్చి త‌మ వంతు సాయంగా విరాళాలు అందించారు.తాజాగా యంగ్ హీరో రామ్ పోతినేని కూడా తన వంతు సహాయంగా రూ.25 ల‌క్ష‌లు విరాళ‌మిస్తున్న‌ట్టు ఇటివల ప్రకటించారు.

దీనికి సంబంధించిన చెక్ ని ఈ రోజు హీరో రామ్ మంత్రి కేటీఆర్ కి అందజేశారు. రామ్ చేసిన సహాయం పట్ల నెటిజన్లు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. నా తెలంగాణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందుతున్నాను. వరదలు వచ్చిన రోజునుంచే క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించడం సంతోషకర విష‌యం. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌లు కూడా ప్ర‌శంసనీయం. నా వంతుగా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాను అని రామ్ ట్వీట్ చేశాడు!


Show Full Article
Print Article
Next Story
More Stories