పెళ్లి పీటలెక్కబోతున్న రామ్.. అమ్మాయి ఎవ‌రంటే..?

Ram Pothineni: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని...

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 7:30 PM IST
Hero Ram Pothineni is Getting Married Soon
X

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్.. అమ్మాయి ఎవ‌రంటే..?

Ram Pothineni: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. "దేవదాసు" అనే సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ ఆ తరువాత రెడీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన రామ్ కొన్ని ఫ్లాప్ సినిమాలను కూడా చవిచూశారు. ఆ తరువాత నేను శైలజ సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చిన రామ్ ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరో బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం రామ్ ఇప్పుడు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. 34 ఏళ్ల ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. ఆగస్టులో నిశ్చితార్థం మరియు నవంబర్ లో పెళ్లి చేయాలని రామ్ ఇంటి సభ్యులు అనుకుంటున్నారట. ఇక సినిమా రంగానికి చెందిన అమ్మాయిని రామ్ పెళ్లి చేసుకుంటాడు అని ఒకప్పుడు ప్రచారం జరిగింది కానీ తాజా సమాచారం ప్రకారం తన చిన్ననాటి స్నేహితురాలు తో రామ్ ప్రేమలో ఉన్నాడని ఆమెను వివాహం చేసుకోబోతున్నారని, ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story