RAPO19: స్ర్కిప్ట్ రాసే పనిలో హీరో రామ్..?

Hero Ram involvement in writing script for RAPO19
x

హీరో రామ్, హీరోయిన్ కృతి శెట్టి (ఫొటో హన్స ఇండియా)

Highlights

RAPO19 : యంగ్ హీరో రామ్ పోతినేని తన రాబోయే చిత్రం #RAPO19 కోసం దర్శకుడు లింగుస్వామితో చేతులు కలిపారు.

RAPO19 : యంగ్ హీరో రామ్ పోతినేని తన రాబోయే చిత్రం #RAPO19 కోసం దర్శకుడు లింగుస్వామితో చేతులు కలిపారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా పేరుపొందిన శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఆధ్వర్యంలో శ్రీనివాస చిత్తూరి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

మొదటి సినిమా 'ఉప్పెన' తో ఫేమస్ అయిన కృతి శెట్టి ఈ చిత్రంలో హీరో రామ్ తో రొమాన్స్ చేస్తుంది. తాజా నివేదికల ప్రకారం, లింగుస్వామి బృందంతో పాటు రామ్ కూడా సినిమా స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నాడని తెలుస్తోంది. చాలా మంది కోలీవుడ్ తారలు లింగుస్వామితో జతకట్టడానికి ముందుకురావడం లేదు. ఈ టైంలో టాలీవుడ్ నటుడు రామ్ ఈ దర్శకుడితో జతకట్టడం గమనార్హం.

లింగస్వామి వివరించిన కథ రామ్ కి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడని తెలుస్తోంది. రామ్ ఆశలన్ని ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories