మతిమరుపు పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో రామ్

మతిమరుపు పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో రామ్

Rama Rao
Published on: 22 March 2022 7:02 AM IST
Hero Ram in the Role of a Forgetful Police Officer
X

మతిమరుపు పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో రామ్

Ram Pothineni: ఈ మధ్యనే "రెడ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో రామ్ తాజాగా ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తమిళ్ తెలుగు బైలింగ్వల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ మతిమరుపు తో బాధపడే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. కేసు చేసే విషయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల ఒక నిర్దోషి కి కఠిన శిక్ష పడుతుందట. ఇక రాయలసీమ లో జరిగే కక్షల గురించి రక్తపాతం గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం. ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి మరియు అక్షర గౌడ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story