పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన హీరో రామ్

Ram Pothineni: గత కొంతకాలంగా యువ హీరో రామ్ ఇప్పుడు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి

Arun Chilukuri
Published on: 14 July 2022 11:16 AM IST
Hero Ram Gave Clarity About Marriage
X

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన హీరో రామ్

Ram Pothineni: గత కొంతకాలంగా యువ హీరో రామ్ ఇప్పుడు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. 34 ఏళ్ల ఈ హీరో త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టుగా పుకార్లు బయటకి వస్తున్నాయి. ఆగస్టులో నిశ్చితార్థం మరియు నవంబర్ లో రామ్ పెళ్లి అని రామ్ ఇంటి సభ్యులు అనుకుంటున్నారని ఆ వార్తల్లో వినిపించింది. ఇక సినిమా రంగానికి చెందిన అమ్మాయిని కాకుండా తన చిన్ననాటి స్నేహితురాలు తో రామ్ ప్రేమలో ఉన్నాడని, రామ్ ఆమెను వివాహం చేసుకోబోతున్నారని, ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

అయితే తాజాగా లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ "వారియర్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ ఈ సినిమా గురించి తన పై వచ్చిన పుకార్ల గురించి క్లారిటీ ఇచ్చారు. తను ప్రేమలో లేనని, తను ఎలాంటి చిన్ననాటి స్నేహితురాలుని పెళ్లి చేసుకోవటం లేదు అని కరాకండిగా చెప్పేసాడు రామ్. మరి త్వరలోనే రామ్ పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అనే విషయంపై మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ మళ్ళీ పుకార్లు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story