Ram Charan Creating Records on Small Screen: బుల్లితెరని షేక్ చేస్తున్న రామ్ చరణ్ ప్లాప్ సినిమా!

Ram Charan Creating Records on Small Screen: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ .. 2019 సంక్రాంతి
Ram Charan Vinaya Vidheya Rama: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ .. 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలం అయింది. దీనితో భారీ ప్లాప్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా వెండితెర మీద పెద్దగా సత్తా చాటలేకపోయినా బుల్లితెర మీద మాత్రం ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటోంది.
ఇప్పటివరకు ఈ సినిమా 10 సార్లు బుల్లితెరపై టెలికాస్ట్ అయింది. ఇలా టెలికాస్ట్ అయిన ప్రతిసారి ఈ సినిమాకి మంచి టీఆర్పీని వస్తుండడం విశేషం.. తాజాగా ఈ సినిమాని స్టార్ మా మరోసారి బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు.అయితే రెండు సార్లు మినహా ప్రతిసారీ 7కి పైనే టీఆర్పీని సాధించిన ఈ చిత్రం ఈసారి కూడా 7.5 టీఆర్పీని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి వస్తున్న టీఆర్పీని చూసి స్టార్ మా ఆశ్చర్యపోతున్నారట.. ఇక ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో మెగా ఫాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
Vijayawada: కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.....
20 Aug 2022 5:11 AM GMT'ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను,' అంటున్న అమలాపాల్
20 Aug 2022 4:55 AM GMTఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన
20 Aug 2022 4:34 AM GMTమునుగోడుపై బీజేపీ ఫోకస్
20 Aug 2022 4:00 AM GMTమునుగోడుపై దూకుడు పెంచిన టీకాంగ్రెస్
20 Aug 2022 3:33 AM GMT