Independence Day Celebrations : ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్!

Independence Day Celebrations : ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్!
x
Hero ram charan independence day celebrations at chiranjeevi charitable trust
Highlights

Independence Day Celebrations : దేశవ్యాప్తంగా 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.. కరోనా విస్తరిస్తున్న

Independence Day Celebrations : దేశవ్యాప్తంగా 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.. కరోనా విస్తరిస్తున్న సమయంలో జరుగుతున్న వేడుకలు కావడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ.. తమతమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు...తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.. ఇందులో రామ్ చరణ్ తో పాటుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి ఫోటోకు పూలమాలలు వేసి రామ్ చరణ్ నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇక దేశ ఐకమత్యం చాటడం కోసం ఏకంగా 65 మంది సింగర్స్ 5 భాషలలో దేశభక్తి పాటను ఆలపించారు.. ఇందులోని వినరా వినరా రేపిక మనదేరా అంటూ సాగే పాటను రామ్ చరణ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో అందరం ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉందని రామ్ చరణ్ వెల్లడించారు.. ఇక అంతకుముందు రామ్ చరణ్ తన ట్విట్టర్ వేదికగా "మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న యోధులకు మరియు మహమ్మారిని అరికట్టడానికి పోరాడుతున్న యోధులకు వందనం. మనం ఈ అడ్డంకులను అధిగమించి ఒక దేశంగా అభివృద్ధి చెందుదాం.. ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య శుభాకాంక్షలు అని తెలియజేశారు రామ్ చరణ్.


ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories