బాలయ్య సినిమాలో రాజశేఖర్... ఇదీ అసలైన కాంబో అంటే..!

Hero Rajasekhar To Play This Crucial Character In Balakrishnas NBK108
x

బాలయ్య సినిమాలో రాజశేఖర్... ఇదీ అసలైన కాంబో అంటే..!

Highlights

NBK108: గత పదిహేనేళ్లలో "గరుడవేగ" సినిమా తప్ప సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ లో ఒక చెప్పుకోదగ్గ సినిమా కూడా లేదు.

NBK108: గత పదిహేనేళ్లలో "గరుడవేగ" సినిమా తప్ప సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ లో ఒక చెప్పుకోదగ్గ సినిమా కూడా లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజశేఖర్ గతంలో తనకి చాలానే విలన్ పాత్రలు వచ్చాయని కానీ ఆయన కావాలని ఆ ఆఫర్లను తిరస్కరించినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక సీనియర్ హీరో సినిమాలో విలన్ పాత్ర పోషించేందుకు రాజశేఖర్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

"అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి సినిమాలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించగా రాజశేఖర్ కూడా ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ ఈ సినిమాలో నడి వయస్కుడి పాత్రలు కనిపించబోతున్నారు.

"పెళ్లి సందడి" బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది అని ఇప్పటికే అనిల్ రావిపూడి ప్రకటించారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన "లెజెండ్", "అఖండ" సినిమాలలో జగపతి బాబు మరియు శ్రీకాంత్ వంటి వారు విలన్ పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రాజశేఖర్ కు బాలయ్య సినిమాలో విలన్ గా నటించటం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories