రాజ్ త‌రుణ్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు!

రాజ్ త‌రుణ్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు!
x
Highlights

షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరో అయ్యాడు యువ హీరో రాజ్ తరుణ్... మొదట్లో వరుస హిట్స్ తో అలరించాడు. ఆ తరవాత వరుస ప్లాప్స్ ఎదురైనప్పటికి వాటితో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరో అయ్యాడు యువ హీరో రాజ్ తరుణ్... మొదట్లో వరుస హిట్స్ తో అలరించాడు. ఆ తరవాత వరుస ప్లాప్స్ ఎదురైనప్పటికి వాటితో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ మధ్య ఒరేయ్ బుజ్జిగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో రిలిజై మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. మళ్ళీ అదే దర్శకుడితో మరో సినిమాని మొదలు పెట్టాడు రాజ్ తరుణ్ ..

ఈ సినిమాతో పాటుగా మరో సినిమాని స్టార్ట్ చేశాడు రాజ్ తరుణ్.. ఇది రాజ్ తరుణ్ కు 15 వ సినిమా కావడం విశేషం... ఈ రోజు ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొదలైంది.. ఈ సినిమాని నంద కుమార్, భ‌ర‌త్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, సాంటో ( మోహన్ వీరంకి) తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా న‌టిస్తుంది. వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. స్వీక‌ర్ అగ‌స్తి సంగీతం అందిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. పూర్తి వినోద భరితంగా ఈ సినిమా సాగనుంది.Show Full Article
Print Article
Next Story
More Stories