ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ముందుగా... శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్

Tirumala: హీరో ప్రభాస్‌తో సెల్ఫీలు తీసుకోడానికి అభిమానుల ఆసక్తి

Jyothi
Published on: 6 Jun 2023 7:11 AM IST
Hero Prabhas Visits Tirumala
X

ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ముందుగా... శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్

Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసారు.. ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్, శ్రీ వేంకటేశ్వర వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు‌ .. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

పురాణ ఇతిహాసాల నేపథ్యంలో తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఆదిపురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు.. ప్రభాస్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహాం చూపారు.

Jyothi

Jyothi

Next Story