Prabhas in Hollywood: ప్రభాస్ తొలి హాలీవుడ్‌లో సినిమా రిలీజ్ ఎప్పుడంటే..!

Prabhas in Hollywood Movie: వరుసగా పాన్ ఇండియా మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో ప్రభాస్.

Venkata Chari
Published on: 26 May 2021 5:03 PM IST
Hero Prabhas Plays a Important Role in Hollywood Tom Cruises Mission Impossible 7 Movie
X

ప్రభాస్ (ఫొటో ట్విట్టర్)

Prabhas in Hollywood Movie: వరుసగా పాన్ ఇండియా మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో ప్రభాస్. టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌ గామారిన ఈ యంగ్ హీరో... దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టాలీవుడ్ స్టార్ హాలీవుడ్ పై కన్నేశాడని తెలుస్తోంది. ఈ మేరకు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం మేరకు... ప్రభాస్ ఓ హాలీవుడ్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. 'మిషన్ ఇంపాజిబుల్ 7' లో ప్రభాస్ ఓ కీలక పాత్రలో యాక్ట చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ డైరెక్షన్ చేయనున్న ఈ సినిమాలో ప్రభాస్.. టామ్ క్రూజ్ తో కలిసి తెరను పంచుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా, ఓ ఇంటర్య్వూలో ఈ సినిమా డైరెక్టర్ క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ చెప్పాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లను కూడా పూర్తి చేసినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే, రాధేశ్యామ్ షూటింగ్ కోసం గతేదాడి టీం ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే హాలీవుడ్ సినిమాకు సంబంధించిన స్టోరీని ప్రభాస్‌కు వినిపించాడంట డైరెక్టర్. ఈమేరకు ఆ సినిమాకు ఓకే చెప్పి, కొన్ని సీన్లు కూడా తీశాడనే టాక్ వినిపిస్తోంది. కాగా, 'మిషన్‌ ఇంపాజిబుల్‌ 7' మూవీ యూఎస్‌లో 2022, మే 27న రిలీజ్ అవనుంది. ఈ వార్త నిజమైతే.. రెబల్ స్టార్ కాస్త.. గ్లోబల్ స్టార్ గా మారిపోతాడని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్.. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే మరో రెండు సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడని తెలుస్తోంది. ఇవి కూడా పాన్ ఇండియా గా రానున్నాయని తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story