Prabhas: నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు..

Hero Prabhas Made Intresting Comments About Nag Ashwin at Kalki 2898 AD Event
x

Prabhas: నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు.. 

Highlights

Prabhas: ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.

Prabhas: ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. జూన్‌ 27న సినిమా విడుదల కానుంది. ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రమోషన్స్‌ మొదలైన నాటి నుంచీ, సినిమాలోని ఒక్కో ప్రధాన పాత్రనూ రివీల్‌ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్‌. ఇందులో ప్రభాస్‌ ‘భైరవ’గా నటిస్తున్న విషయం తెలిసిందే.

భైరవ మిత్రుడైన ‘బుజ్జి’ పాత్రను బుధవారం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక ఈవెంట్‌ని ఏర్పాటు చేసి, విభిన్నంగా ‘బుజ్జి’ కేరక్టర్‌ను చిత్రబృందం రివీల్‌ చేశారు. బుజ్జి అంటే ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో ప్రభాస్‌ నడిపే కారు. ఆ సినిమాకోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆ కారును ప్రభాస్‌ నడుపుకుంటూ రివీలయ్యారు.

అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చెర్ పెట్టినట్లు ప్రభాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి క్యాజువల్‌ గా వద్దామని అనుకున్న కానీ నాగ్ అశ్విన్ నన్ను ఈ స్టంట్స్ చేసేలా చేశాడు. అలాగే ఈ సినిమాకు హైప్ పెంచడానికి నాతో ఆ ట్వీట్ చేయించాడు..అయితే బుజ్జి గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసాడు. బుజ్జి పేరు చిన్నది అయిన అది సినిమాకు చాల ప్రత్యేకం. బుజ్జి టీజర్ అందరికి నచ్చిందని ఆశిస్తున్నా అని ప్రభాస్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories