Prabhas: లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్‌.. ఇకనుండి అక్కడేనట..!

Prabhas Buys New Home In London
x

Prabhas: లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్‌.. ఇకనుండి అక్కడేనట..!

Highlights

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ మూడు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్నది మాత్రం చెప్పడం కాస్త కష్టమే. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్ మాత్రం ఈ ఏడాది వచ్చేలానే ఉన్నాయి. సలార్ 2 వచ్చే ఏడాది వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే ఏడాదిలో స్పిరిట్ సినిమాను కూడా స్టార్ట్ చేస్తాడని సమాచారం.

తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. లండన్‌లో విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. రూ.కోటి వరకు అద్దె చెల్లించేవారని సమాచారం. ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories