అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్..

అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్..
x
Highlights

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియన్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ...

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియన్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ కోర్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమధ్య విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియోలు రెండు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు డార్లింగ్ ప్రభాస్ ఒక ప్రత్యేక స్పెషల్ సర్ ప్రైజ్ ను ఇవ్వబోతున్నారట.

తాజాగా ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేశాడు ప్రభాస్. రేపు తన అభిమానులందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని, దాని కోసం తన ఇంస్టాగ్రామ్ చూడమని చెప్పుకొచ్చాడు ప్రభాస్. 'సాహో' కి సంబంధించిన ఏదో ఒక ఇంపార్టెంట్ వార్తను ప్రభాస్ రేపు రివీల్ చేయబోతున్నాడు అని తెలుస్తోంది. అదేంటో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories