Pawan Thanks To Mahesh : పవన్ బర్త్ డే : మహేష్ ట్వీట్.. పవన్ స్వీట్ రిప్లై!

Pawan Thanks To Mahesh : నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మెగా

Krishna
Published on: 3 Sept 2020 10:38 AM IST
Pawan Thanks To Mahesh : పవన్ బర్త్ డే : మహేష్ ట్వీట్.. పవన్ స్వీట్ రిప్లై!
X

mahesh babu, pawan kalyan

Pawan Thanks To Mahesh : నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మెగా అభిమానులు, సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖులు అయనకి శుభాకాంక్షలు అందజేశారు. అయితే ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందించడం మోస్ట్ హైలెట్ గా చెప్పాలి.. " హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్. నీ గొప్ప గుణాలు ప్రేరణను కలిగిస్తాయి. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాలని కోరుకుంటున్నాను" అని పవన్ తో గతంలో ఉన్న ఓ ఫోటోను జత పరుస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

పవన్ బర్త్ డేకి మహేష్ ట్వీట్ చేయడంతో ఇద్దరు హీరోల అభిమానులు సంతోషంలో మునిగి తేలారు. మహేష్ నుంచి చాలా ఏళ్ల తర్వాత ఇలా పవన్ కోసం ఒక ట్వీట్ రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే మహేష్ ట్వీట్ కి పవన్ రిప్లయ్ ఇస్తాడా లేదా అన్న ఓ సందేహం అందరిలో మొదలైంది. ఆ సస్పెన్స్ కి తెర దించుతూ పవన్ రిప్లయ్ ఇచ్చారు. "మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మహేష్ బాబు గారు.." అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీనితో ఇద్దరు హీరోల అభిమానుల్లో ఆనందం మరింత రెట్టింపు అయింది.

ఇండస్ట్రీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టార్ హీరోలు అన్న సంగతి తెలిసిందే.. అయితే అభిమానులకి మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అనే భావన సహజంగా ఉంటుంది. కానీ మా హీరోల మధ్య ఆలాంటి భావన మా మధ్య లేదని భరత్ అను నేను ఆడియో ఫంక్షన్ లతో పాటుగా పలు సభల్లో చెప్పారు.. ఇక అభిమానులు కూడా కలిసి ఉండాలని అప్పుడే ఇండస్ట్రీ కూడా బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ తో పాటుగా తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ ..

Krishna

Krishna

Next Story