Devara Pre Release: దేవర ప్రీ రిలీజ్ రద్దు బాధాకరం..కానీ సినిమా చూసి కాలర్ ఎగరేస్తారు

Devara Pre Release:జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దు అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ను ఉద్దేశించి హీరో ఎన్టీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Sept 2024 6:00 AM IST
Hero NTR reacts on the cancellation of Devaras pre-release function
X

 Devara Pre Release: దేవర ప్రీ రిలీజ్ రద్దు బాధాకరం..కానీ సినిమా చూసి కాలర్ ఎగరేస్తారు

Devara Pre Release: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన దేవర పార్ట్ 1 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దు అయ్యింది. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఆదివారం సాయంత్రం ఈ ఈవెంట్ జరగాల్సి ఉండగా అంచనాకు మించి అభిమానులు వచ్చారు. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. దీనిపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.

అభిమాన సోదరులకు నమస్కారం. ఈ రోజు దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఎక్కువ బాధ అనిపిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని ఉంటుంది. దేవర మూవీ గురించి ఈ మూవీ కోసం పడ్డ కష్టం గురించి అందరికీ వివరించాలని అనుకున్న. కానీ భద్రతా కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. మళ్లీ చెబుతున్నా మీకంటే నాకు ఎక్కువగా బాధ అనిపిస్తోంది. మేకర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ వైఫల్యం వల్ల ఇలా జరిగిందనడం తప్పు అనేది నా అభిప్రాయం. మీ ప్రేమకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇవాళ కలవడం కుదరకపోయినా..సెప్టెంబర్ 27న మనం మళ్లీ కలుస్తున్నాం. దేవర చిత్రాన్ని అందరూ చూడబోతున్నారు. మీరు కాలర్ ఎగరేసుకునేలా ఈ మూవీ ఉంటుంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాము. మీ ప్రేమ, ఆశిర్వాదం మాపై ఉండాలి. అందరూ జాగ్రత్తగా వెళ్లారని ఆశీస్తున్నాను అంటూ ఎన్టీఆర్ వీడియోలో పేర్కొన్నారు.


ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జనరల్ పాసులు పొందిన వారంతా వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయట ఉన్నారు. కొందరు అభిమానులు హోటల్ అద్దాలను ద్వంసం చేశారు. కుర్చీలను పగలకొట్టారు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. హోటల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ ను రద్దు చేశారు. అతిథిగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ వెనుదిగిరి వెళ్లిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించగా..సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 27 న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసినా అనివార్య కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story