NTR: టీవి షో నుంచి ఎన్టీఆర్ త‌ప్పుకుంటున్నారా?

Hero NTR Quit From Meelo Evaru Koteeswarudu TV Show
x

జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు (ఫైల్ ఇమేజ్)

Highlights

NTR: క‌రోనా కార‌ణంగా ఈ షో తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా ఇప్ప‌టికే ఈ షో కోసం ఎన్టీఆర్ డేట్స్ అన్ని వేస్ట్ అయ్యాయ‌ని టాక్

NTR: టాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ బుల్లితెర‌పై మ‌రోసారిం హంగామా చెస్తార‌ని అంతా భావించారు. ఆయ‌న అభిమానులు కూడా పండ‌గ చేసుకున్నారు. 'కల మీది కథ మీది. ఆట నాది కోటి మీది అంటూ ఎన్టీఆర్ ఊరించారు. తీరా బుల్లితెర మీద సామాన్యుల క‌ల‌ల షో కొద్దీ రోజుల్లో ప్రారంభం అవుతుంద‌నేలోగా మాయ‌దారి క‌రోనా అంతా ముంచింది. అన్ని స‌వ్యంగా ఉంటే ఎవ‌రు మీలో కోటిశ్వరులు షో స్టార్ట్ అయిఉండేది. క‌రోనా కార‌ణంగా ఈ షో తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా..ఇప్ప‌టికే ఈ షో కోసం ఎన్టీఆర్ డేట్స్ అన్ని వేస్ట్ అయ్యాయ‌ని టాక్.

అయితే ఎన్టీఆర్ మళ్లీ ఆగస్టు నుంచి వరస ప్రాజెక్టులతో బిజీ అయ్యిపోతారంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ప్యాచ్ వర్క్ ఉండచ్చు. అలాగే కొరటాల శివ సినిమా స్టార్ట్ కావచ్చు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దాంతో షో స్టార్ట్ అయ్యాక తను సినిమా షూటింగ్ లు అంటూ వెళ్లిపోతే ఇబ్బంది అవుతుంది. ఈ షో నిమిత్తం ఎన్టీఆర్ కు 10 కోట్లు దాకా ఇస్తున్నారు. అలాగే భారీగా అడ్వాన్స్ ఇచ్చారంట నిర్వాహ‌కులు.

ఇక ఎన్టీఆర్ వ‌రుస సినీమాలు చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఈ షో నెక్ట్స్ టైమ్ చేస్తానని ఈ సారికి వేరే వారితో ముందుకు వెళ్లమని సూచించారని స‌మాచారం. అయితే ఈ షోకు ఎన్టీఆర్ వల్ల ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ తప్పుకుంటే క‌ష్ట‌మ‌ని నిర్వ‌హాకులు భావిస్తున్నారంట‌. అందుకే సినిమా షూటింగ్ చేస్తున్నా..గ్యాప్ లలో టైమ్ ఇస్తే చాలు అని షో నిర్వాహకులు పట్టుపడుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ వారిని నొప్పించే నిర్ణ‌యం తీసుకోర‌ని తెలుస్తోంది. షో ప్రారంభం కాస్త లేట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. 'ఆర్ఆర్ఆర్'లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు. రామ్ చ‌రణ్ మరో హీరోగా కనిపించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ను రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories