భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన హీరో నితిన్‌.. వీడియో వైర‌ల్..

Hero Nitin Celebrates his Wife Shalini Birthday
x

భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన హీరో నితిన్‌.. వీడియో వైర‌ల్..

Highlights

Hero Nitin: దేశంలో కరోనా థర్డ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది.

Hero Nitin: దేశంలో కరోనా థర్డ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది. పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడు నెలల గ్యాప్‌ తర్వాత దేశంలో మళ్లీ లక్ష కేసులు నమోదయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతిఒక్కరు మహమ్మారి భారిన పడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే విశ్వేక్‌ సేన్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్‌ బాబు కరోనా బారీన పడ్డారు. ఈ జాబితాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ భార్య శాలిని కూడా ఉన్నారు. ఆమెకు ఇటీవలే కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అయితే నేడు ఆమె పుట్టిన రోజు.

అయితే భార్యకు కరోనా సోకినప్పటికి నితిన్‌ తన భార్య బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసి ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. భార్య బర్త్‌డే వినూత్నంగా సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ భార్యపై ప్రేమ కురిపించాడు. కరోనాకి హద్దులు ఉండొచ్చేమో.. కానీ, ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయ‌న అన్నాడు. జీవితంలో ఫస్ట్ టైం త‌న భార్య‌ నెగిటివ్ కావాలని కోరుకుంటున్నానని ఆయ‌న పేర్కొన్నాడు. కాగా, త‌న భార్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నితిన్ ప‌లువురితో క‌లిసి కేక్ క‌ట్ చేశాడు. ఆయ‌న కేక్ క‌ట్ చేస్తుండ‌గా ఆయ‌న భార్య కిటికీలోంచి చూసింది. కేక్ కట్ చేసి ఆమెకి చూపిస్తూ నితిన్ కేక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నితిన్ త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories