Nithiin: తన రూటు మార్చబోతున్న నితిన్

Nithiin: ఓటీటీలలో అడుగుపెట్టనున్న యువహీరో

admin1
Updated on: 29 Nov 2021 4:25 PM IST
Hero Nithiin Going to be Entering Into OTT
X

ఓటీటీలో అడుగు పెట్టబోతున్న యువ హీరో (ఫైల్ ఇమేజ్)

Nithiin: లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఓటీటీల క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు నుంచి యువ హీరోల వరకు చాలా మంది ఓటీటీల దారిలో వెళుతున్నారు. తాజాగా ఓటీటీల లో అడుగుపెట్టడానికి సిద్ధమైన యువ హీరో నితిన్. ఈ మధ్యనే "రంగ్ దే" అనే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించిన నితిన్ త్వరలోనే ఓటీటీల ప్లాట్ ఫార్మ్స్ లో అడుగు పెట్టాలని ఆసక్తి చూపిస్తున్నారట. వచ్చే ఏడాది లోపల నితిన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ హౌస్ లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే నితిన్ వెబ్ సిరీస్ లో నటించడం మాత్రమే కాక కొన్ని వెబ్ సిరీస్ ను నిర్మించాలని కూడా అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే పలు రైటర్లు మరియు డైరెక్టర్లని కూడా కలవడం జరిగింది. ఒకవేళ మంచి కథ దొరికితే నితిన్ ఆ వెబ్ సిరీస్ నిర్మించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల పరంగా చూస్తే నితిన్ హీరోగా "మాచర్ల నియోజకవర్గం" త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రూరల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎమ్ ఎస్ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

admin1

admin1

Next Story