గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో నిఖిల్

Arun Chilukuri
Published on: 17 Nov 2020 7:57 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో నిఖిల్
X

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌ను హీరో నిఖిల్‌ స్వీకరించారు. గచ్చిబౌలి లోని అవతార్ నివాస గృహా సముదాయంలో నిఖిల్‌ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెరుగుతుందని తెలిపారు. మంచి కార్యక్రమం ప్రారంభిచిన సంతోష్‌ కుమార్‌ను హీరో నిఖిల్‌ అభినందించారు. అనంతరం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, అవికా గౌర్. కలర్ స్వాతి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story