Navdeep: నార్కోటిక్‌ పోలీసు విచారణకు హాజరుకానున్న హీరో నవదీప్‌..!

Navdeep: మరో 35 మంది నిందితులను గుర్తించిన పోలీసులు

Shekhar G
Published on: 23 Sept 2023 9:39 AM IST
Hero Navdeep To Appear For Trial In Drug Case Today
X

Navdeep: నార్కోటిక్‌ పోలీసు విచారణకు హాజరుకానున్న హీరో నవదీప్‌..!

Navdeep: హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు. కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుంటోంది నార్కోటిక్స్ టీమ్‌. హీరో నవదీప్‌కు 42 CrPC నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. హీరో నవదీప్‌కు డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు డ్రగ్స్‌ కేసులో 8 మందిని అరెస్ట్‌ చేయగా.. మరో 35 మంది నిందితులను గుర్తించారు. ఇప్పుడు.. నవదీప్‌ విచారణతో మరికొంత మంది సినీ ఇండస్ట్రీకి చెందినవారి పేర్లు ఏమైనా తెరపైకి వస్తాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Shekhar G

Shekhar G

Next Story