ఆ రిక్షా అతని వల్లే హీరో అయ్యాను: నవదీప్

తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు నవదీప్.. గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామ మొదలగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Krishna
Updated on: 29 Oct 2020 3:22 PM IST
ఆ రిక్షా అతని వల్లే హీరో అయ్యాను: నవదీప్
X

తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు నవదీప్.. గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామ మొదలగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా ఆర్య2, ఓ మై ఫ్రెండ్, బాద్షా మొదలగు సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. ఈ ఏడాది అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో చిత్రంలో నటించాడు.. మెప్పించాడు నవదీప్.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు నవదీప్. తానూ హీరో అవ్వడానికి రిక్షా అతను మెయిన్ రీజన్ అని చెప్పుకొచ్చాడు నవదీప్. ఓ రోజు సినిమా చూసి వస్తుంటే రిక్షా అతను తనని చూసి హీరో అవ్వొచ్చుగా బాబు భలే ఉన్నారు అనడంతో తనకి కూడా హీరో అవ్వాలనే ఆలోచన కలిగిందని నవదీప్ వెల్లడించాడు. ఇక చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల కోసం తాను థియేటర్లలో చొక్కాలు చింపుకొనే వాడినని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నవదీప్. ఇక తానూ జీవితంలో పర్ఫెక్ట్ కాదని సరదాగా చెప్పుకొచ్చాడు నవదీప్.

ఇక ప్రస్తుతం నవదీప్ బుల్లితెర హోస్ట్ గా జడ్జ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక మంచు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్ళు సినిమాలో కూడా నటిస్తున్నాడు నవదీప్. ఇందులో నవదీప్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ గా తెరకేక్కుతున్నా ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రుహానీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం జెఫ్రీ గి చిన్ వహిస్తున్నారు.

Krishna

Krishna

Next Story