Nani's V Movie : ఓటీటీ లోనే నాని 'V' సినిమా?

Nanis V Movie : ఓటీటీ లోనే నాని V సినిమా?
x
Nani;s V movie
Highlights

Nani’s V Movie : నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా 'V'... ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ

Nani's V Movie : నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా 'V'... ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు.. బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేసింది. ఇది హీరో నానికి 25 వ సినిమా కాగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మూడో సినిమా..

ఈ సినిమా షూటింగ్, సెన్సార్ కార్యక్రమాలు అన్ని అయిపోయి విడుదలకి సిద్దంగా ఉంది అనుకున్న క్రమంలో దేశంలో కరోనా వ్యాప్తి విస్తరించడం.. దీనితో ధియేటర్లు మూతపడడంతో సినిమా విడుదలని వాయిదా వేశారు. ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సంస్థలు ఊపందుకొని పలు సినిమాలు ఆన్‌లైన్ వేదికలపై రిలీజ్ అవుతున్నాయి.. ఈ క్రమంలో ఈ సినిమాని కూడా ఓటీటీ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ధియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారా అనే నమ్మకం కూడా లేదు.. మరోపక్కా కంటెంట్ కూడా ఓల్డ్ అయ్యే ఛాన్స్ ఉండడంతో ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఇచ్చిన 35 కోట్ల రూపాయల ఆఫర్ చేసినట్టుగా సమాచారం.. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్..

Show Full Article
Print Article
Next Story
More Stories