Nani Comments: రెస్టారెంట్లు, పబ్స్‌ కంటే థియేటర్స్ చాలా సేఫ్

* థియేటర్స్‌నే ముందు మూస్తారు, చివరలో తెరుస్తున్నారు * నిత్యావసర ధరలు పెరుగుతున్నా పట్టించుకోరు. కానీ సినిమాపై ఆంక్షలా?

Sandeep Reddy
Updated on: 28 July 2021 7:29 AM IST
Hero Nani Shocking Comments On Theaters Close Issue And He Says Theaters Are Much Safer Than Restaurants And Pubs
X

నాని (ఫైల్ ఫోటో) 

Nani Comments: నేచురల్ స్టార్ నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా పట్టించుకోరు కానీ సినిమాలపై ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు అన్నింటి కంటే ముందు థియేటర్లు మూసివేస్తారు. చివరకు తెరుస్తారన్నారు. బార్లు, పబ్‌ల కంటే థియేటర్లు చాలా సెఫ్టీ ప్లేస్ అన్నారు. థియేటర్స్ వ్యవస్థపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారని నాని అన్నారు. మనదేశంలో సినిమాను మించిన ఎంటర్‌టైన్‌మెంట్ లేదన్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే థియేటర్ వ్యవస్థ నాశనం అవుతుందని నెక్ట్స్ జనరేషన్‌కు థియేటర్‌లో సినిమా చూడడం అనేది కష్టమేనన్నారు. అంతా కలిసి సమస్యను పరిష్కరించాలని నాని అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story