Nani 'V' Movie : అభిమానులకి హీరో నాని ఆఫర్!

Nani V Movie : అభిమానులకి హీరో నాని ఆఫర్!
x

Nani 

Highlights

Nani 'V' Movie : నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా ఇంద్రగంటి మోహన‌కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం 'V... మొద‌ట ఈ చిత్రాన్ని

Nani 'V' Movie : నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా ఇంద్రగంటి మోహన‌కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం 'V... మొద‌ట ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ చాలా ప్రయ‌త్నాలు చేసింది. కానీ అప్పుడే క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చడంతో.. థియేట‌ర్స్ అన్ని లాక్ డౌన్ కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం సెప్టెంబర్ 05 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

ఈ నేపధ్యంలో తన అభిమానులకి మంచి ఆఫర్ ఇచ్చాడు నాని.. తన సినిమా ట్రైలర్ ని విడుదల చేసే అవకాశాన్ని అభిమానులకి కల్పించాడు. " ట్రైలర్ ని మాతో కలిసి మీరు కూడా విడుదల చేయవచ్చు.. మీ ఫోటోను ( నాని స్టైల్ లో ) vthemovie.inలో షేర్ చేయండి. లేదా #TrailerOnPrime అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లేదా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయండి. బిగ్ న్యూస్ కోసం వెయిట్ చేయండి" అంటూ నాని వెల్లడించాడు..



ఈ సినిమాలో నాని ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటం విశేషం. ఇందులో నాని ఓ కిల్లర్ రోల్ పోషించగా, అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్ , ట్రైలర్, సాంగ్స్ సినిమా పైన మంచి అంచనాలు పెంచింది. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు.

నాని సినీ కెరీర్ లో 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందించగా.. శిరీష్‌,ల‌క్ష్మణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. సైరా నరసింహా రెడ్డి చిత్రానికి సంగీతం అందించిన అమిత్ త్రివేది బాణీలు అందించారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories