Ghost Movie: నాగార్జున సినిమా నుంచి తప్పుకుంటున్న హీరోయిన్లు

*హీరోయిన్ విషయంలో ఇబ్బందులు పాలైన నాగార్జున చిత్ర బృందం

admin1
Updated on: 20 Nov 2021 6:30 PM IST
Hero Nagarjuna Ghost Movie Team Facing Heroines Issue
X

Ghost Movie: నాగార్జున సినిమా నుంచి తప్పుకుంటున్న హీరోయిన్లు

Ghost Movie: ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తన తదుపరి సినిమా అయినా "గోస్ట్" తో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి హీరోయిన్ విషయంలో చిత్ర బృందానికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ముందుగా ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె ను పెట్టి రెండు మూడు రోజులు షూటింగ్ కూడా జరిపారు.

కానీ త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ అమల పాల్ ను ఎంపిక చేశారు. కానీ ఈమె ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. పైగా ఈ సినిమాలో నాగార్జునతో స్విమ్మింగ్ పూల్ లో ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. దీంతో ఆమె భారీ మొత్తాన్ని అడిగింది. నిర్మాతలు నో చెప్పడంతో ఆమె కూడా సినిమా నుంచి తప్పుకుంది. ఇలా ఇద్దరు హీరోయిన్లు సినిమా నుండి తప్పుకున్నారు.

admin1

admin1

Next Story