Naga Shaurya: సిక్స్ ప్యాక్ తో షాకిస్తున్న నాగ శౌర్య

Naga Shaurya: సిక్స్ ప్యాక్ లుక్ తో నాగశౌర్య

admin1
Published on: 25 Nov 2021 12:09 PM IST
Hero Naga Shaurya Shocking Six Pack Look in Lakshya Movie
X

నాగ శౌర్య (ఫైల్ ఇమేజ్)

Naga Shaurya: యువ హీరో నాగ శౌర్య "అశ్వత్థామ" వంటి యాక్షన్ థ్రిల్లర్ తర్వాత "వరుడు కావలెను" అంటూ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక తాజాగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య ఓ సినిమా చేస్తున్నరు. కాగ నాగ శౌర్య "లక్ష్య" అనే సినిమా తో కూడా బిజీ గా ఉన్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాప్ డ్రామా గా తెరకెక్కుతున్న "లక్ష్య" సినిమాలో నాగశౌర్య ఒక విభిన్న లుక్ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన చిత్ర పోస్టర్ లో కూడా నాగ శౌర్య లుక్ విభిన్నంగా ఉండబోతోంది అని తెలుస్తోంది. సిక్స్ ప్యాక్ తో అసలు నాగ శౌర్య ఏనా అన్నంత షాకింగ్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ జగర్లపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story