నాగశౌర్య సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్!

నాగశౌర్య సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్!
x
Highlights

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న 20 వ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమాకి ‘లక్ష్య’ అనే టైటిల్‌ ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని నాగశౌర్య స్వయంగా ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న 20 వ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమాకి 'లక్ష్య' అనే టైటిల్‌ ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని నాగశౌర్య స్వయంగా ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పైన భారీ అంచనాలను పెంచగా, తాజాగా టైటిల్ సినిమా పైన ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. ఇందులో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. నారాయణదాస్‌ కె.నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రీడా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎయిట్ ప్యాక్ బాడీతో నాగశౌర్య కనిపిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories