Naga Chaitanya : చైతూతో మరోసారి రకుల్.. అక్టోబర్‌లో 'థ్యాంక్యూ' షురూ?

Naga Chaitanya : అక్కినేని కుటుంబం డ్రీం ప్రాజెక్ట్ 'మనం' సినిమాని డైరెక్ట్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు విక్రమ్‌

Krishna
Published on: 4 Sept 2020 11:32 AM IST
Naga Chaitanya : చైతూతో మరోసారి రకుల్.. అక్టోబర్‌లో థ్యాంక్యూ షురూ?
X

Rakul preet singh, Naga Chaitanya, priya bhavani shankar  

Naga Chaitanya : అక్కినేని కుటుంబం డ్రీం ప్రాజెక్ట్ 'మనం' సినిమాని డైరెక్ట్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌.. ఆ తర్వాత అఖిల్ తో చేసిన హలో ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.. తాజాగా అక్కినేని నాగచైతన్యతో సినిమాని చేసేందుకు రెడీ అయిపోయారు విక్రమ్. ఇటివల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్సు చేశారు.. 'థ్యాంక్యూ' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు నిర్మిస్తారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్లగా ఇద్దర్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ గా రకుల్‌ ప్రీత్‌సింగ్ కాగా రెండో హీరోయిన్ గా తమిళ నటి ప్రియా భవానీ శంకర్‌ ను ఫైనల్ చేసినట్టుగా సమాచారం.. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక గతంలో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్, నాగచైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే.

మనం' తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కాగా, ఇక దిల్ రాజు సంస్థలో నాగచైతన్య కూడా ఇదో రెండో సినిమా.. అంతకుముందు వీరి కాంబినేషన్ లో జోష్ అనే సినిమా తెరకెక్కింది.. నాగ‌చైత‌న్యకి ఇది 20 వ సినిమా కావడం విశేషం.. త్వరలోనే మిగితా నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారు. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ మొదలు కానుంది అని సమాచారం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య సరసన ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా పైన మంచి హైప్ క్రియేట్ చేశారు.. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. వాస్తవానికి ఈ సినిమా తర్వాత నాగ చైతన్య పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబుతో పరశురాం సినిమా ఫిక్స్ అవడంతో నాగ చైతన్య విక్రమ్ కె.కుమార్ సినిమా ని లైన్ లో పెట్టాడు.

Krishna

Krishna

Next Story