Naga Chaitanya: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి నాగచైతన్య

Naga Chaitanya: నాగ చైతన్య అతి త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు

Venkata Chari
Updated on: 4 May 2021 9:02 PM IST
Hero Naga chaitanya Enters into Digital Platform
X

హీరో నాగ చైతన్య (ఫైల్ ఇమేజ్)

Naga Chaitanya: నాగ చైతన్య అతి త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజా నివేదికల ప్రకారం, డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చైతూ తన మొదటి వెబ్ సిరీస్ పై సంతకం చేశాడంట.

ఈ వెబ్ సిరీస్ ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరుగుతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ ఏడాది జులైలో మొదలకానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగ చైతన్య తదుపరి చిత్రం 'థాంక్స్' దర్శకుడు విక్రమ్ కె కుమార్ నాగ చైతన్య వెబ్ సిరీస్‌కు కూడా చేయనున్నారు. అతుల్ కులకర్ణి, రాధికా ఆప్టే వంటి పాన్-ఇండియన్ స్టార్స్ ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు, థాంక్స్ మూవీ యూనిట్ ఇటీవలే ఇటలీ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చింది. జూన్‌లో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

తాజా సమాచారం మేరకు, నాగ చైతన్య భార్య సమంతా అక్కినేని కూడా అమెజాన్ ప్రైమ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' తో డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. నాగ చైతన్య కూడా త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి సందడి చేయనున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story