Mohan Babu New Movie : 'సన్ ఆఫ్ ఇండియా'గా మోహన్ బాబు..

Mohan Babu New Movie : సన్ ఆఫ్ ఇండియాగా మోహన్ బాబు..
x
Son Of India First Look
Highlights

Mohan Babu New Movie : కలెక్షన్ కింగ్ గా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు హీరో మోహన్ బాబు.. అయన గత కొద్ది రోజులుగా సినిమాలకి

Mohan Babu New Movie : కలెక్షన్ కింగ్ గా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు హీరో మోహన్ బాబు.. అయన గత కొద్ది రోజులుగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు.. అయన చివరగా 'గాయత్రి' సినిమాలో నటించారు.. ఆ తర్వాత మళ్ళీ అయన తెర పైన కనిపించింది లేదు.. ప్రస్తుతం సూర్య హీరోగా వస్తున్న 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అయన ఎయర్‌ఫోర్స్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ రోజు శనివారం74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన చిత్రంగా 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాను ప్రకటించారు మోహన్ బాబు .

ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే ఈ సినిమా దేశ భక్తి కథాంశంతో తెరకెక్కుతోన్నదని అర్ధం అవుతుంది.. అందువల్లే ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రకటించారు మోహన్ బాబు..

ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు.. ఓ దేశభక్తి కథాశంతో ముందుకు రావడంతో అయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. ఇక ఈ సినిమాలోని నటీనటులని, సాంకేతిక నిపుణులని త్వరలో ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ చివర్లో సినిమా పట్టాలేక్కనుంది.. ఇక ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories