దిల్ రాజు ను నిలదీసిన మహేష్

దిల్ రాజు ను నిలదీసిన మహేష్
x
Highlights

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'మహర్షి'. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా...

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'మహర్షి'. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 25 వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. కానీ గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందని ఫిలింనగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. మహేష్ బాబు సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకుంటున్నాడు అంటూ పుకార్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు దిల్ రాజు ను నిలదీశాడట.

అసలు తనకు తెలియకుండా ఇలాంటి వార్తలు ఎవరు లీక్ చేస్తున్నారు అని మహేష్ గట్టిగా అడిగాడట. నిజానికి ఎంత కష్టమైనప్పటికీ ఏప్రిల్ 25 వ తారీకు సినిమా విడుదల చేయాలని మహేష్ అనుకుంటున్నాడు. గతంలో ఏప్రిల్ లో విడుదలైన తన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఏప్రిల్ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా వర్తించాలని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా వాయిదా పడటంతో మహేష్ మాత్రమే కాక ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. మరోవైపు షూటింగ్తో పాటు డబ్బింగ్ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. మరి ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories