Sarkaru Vaari Paata Motion Poster : మహేష్ అభిమానులను బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన 'సర్కారు వారి పాట' టీం!

Sarkaru Vaari Paata Motion Poster : అభిమానులకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది 'సర్కారు వారి పాట’ టీం.. ఈ రోజు ( ఆగస్టు 09) న మహేష్ బాబు పుట్టిన రోజు

Krishna
Published on: 9 Aug 2020 11:44 AM IST
Sarkaru Vaari  Paata Motion Poster : మహేష్ అభిమానులను బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సర్కారు వారి పాట టీం!
X
Sarkaru Vaari Paata Motion Poster

Sarkaru Vaari Paata Motion Poster : అభిమానులకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది 'సర్కారు వారి పాట' టీం.. ఈ రోజు ( ఆగస్టు 09) న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ తో ముందుకు వచ్చింది.. ఆగస్ట్ 9న ఉదయం 9గంటల 9నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్‌గా అనౌన్సు చేసిన సంగతి తెలిసిందే.. సరిగ్గా అనుకున్న సమయానికే మోషన్ పోస్టర్ తో ఆదరగోట్టింది.. మళ్ళీ అదే రూపాయి బిళ్ళతో టాస్ చేస్తూ ఆకట్టుకున్నారు. కానీ మహేష్ లుక్ ని మాత్రం సస్పెన్స్ లో పెట్టింది చిత్రబృందం.. ఇక మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ అందించిన నేపధ్య సంగీతం సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తోంది. బ్యాంకింగ్ లోని లోపాలను ఎత్తి చూపుతూ ఈ కథ సాగనుందని సమాచారం..త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు నెలకొన్నాయి..



Krishna

Krishna

Next Story