Mahesh Babu: హీరో మహేష్‌బాబు మోకాలికి శస్త్రచికిత్స

Mahesh Babu: ఫిబ్రవరి నుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్న మహేష్‌బాబు...

admin1
Updated on: 14 Dec 2021 4:42 PM IST
Hero Mahesh Babu Got Knee Operation in Spain and Taking Rest at Dubai | Tollywood News Today
X

Mahesh Babu: హీరో మహేష్‌బాబు మోకాలికి శస్త్రచికిత్స

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వెకేషన్ కోసం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో దుబాయ్ కి వెళ్లారు అని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు దుబాయ్ వెళ్ళింది వెకేషన్ కోసం కాదని రెస్ట్ కోసం అని తెలుస్తోంది. మహేష్ బాబుకి ఈ మధ్యనే మోకాలికి సర్జరీ జరిగిందట. స్పెయిన్ లో ఒక పెద్ద ఆస్పత్రిలో మహేష్ బాబు సర్జరీ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం కోసం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తాజాగా ఇప్పుడు "సర్కారు వారి పాట" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామా గా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా దర్శకత్వం లో ఒక సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాల గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.


admin1

admin1

Next Story