Mahesh Babu On MS Dhoni Retirement : ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం : మహేష్

Mahesh Babu On MS Dhoni Retirement : ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం : మహేష్
x
Mahesh babu , Ms Dhoni (File Photo)
Highlights

Mahesh Babu On MS Dhoni Retirement : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా...

Mahesh Babu On MS Dhoni Retirement : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా... దాదాపుగా 16ఏళ్ళు టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించిన ధోని అందరికి షాక్ ఇస్తూ నిన్న (ఆగస్టు 15)న తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.. వాస్తవానికి గత ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్ తర్వాత ధోని దాదాపుగా జట్టుకు ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు. ఇక ఎవరు ఉహించిన విధంగా నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.. ఇక కేవలం ధోని ఐపీఎల్ లో మాత్రమే ధోని ఆడనున్నాడు.

ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ధోని పేరు మారు మ్రోగిపోతుంది... ఇక ధోని రిటైర్మెంట్ పై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు.. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... "ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు" అంటూ 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సిక్సర్ బాదిన ఫోటోను షేర్ చేశాడు మహేష్ బాబు..


ధోనీ.. కెప్టెన్‌గానూ 2007‌లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్న ఈ మాజీ కెప్టెన్ ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories