టోటల్లీ ఫేక్ బ్రో.. నేనింకా పిల్లాడినే : మాధవన్

ప్రస్తుతం వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.
పలానా హీరో సినిమా వస్తుంది అంటే చాలు దానిపైన లేక్కలేనన్ని వార్తలు వస్తాయి. అవి నిజమో కాదో తెలియాలంటే అయితే చిత్ర యూనిట్ ఐనా స్పందించాలి లేదా సినిమా విడుదల అయ్యే వరకు ఐనా ఆగాలి. లేకపోతే వీటికి అంతం అంటూ ఉండదు. ఇప్పుడు ఇలాంటిదే వరుణ్ తేజ్ సినిమా విషయంలోనూ జరిగింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వరుణ్ కి తండ్రిగా హీరో మాధవన్, తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనితో సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. ఈ వార్త నిజమా కదా అనే సందేహంతో ఓ అభిమాని ఏకంగా హీరో మాధవన్ ని ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించాడు.
అయితే దీనికి స్పందించిన మాధవన్ టోటల్లీ ఫేక్ బ్రో నేనింకా పిల్లాడినే అంటూ స్మైల్ సింబల్ పెడుతూ రిప్లై ఇచ్చాడు . మొత్తానికి మాధవన్ ఇచ్చిన సమాధానంతో సినిమాపై వస్తున్న ఫేక్ న్యూస్ లకి చెక్ పెట్టినట్లు అయింది. ప్రస్తుతం మాధవన్ నిశబ్దం అనే సినిమాలో నటిస్తున్నాడు. అనుష్క మెయిన్ రోల్ లో నటిస్తుంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Totally fake bro. 🙈🙈I am still a kid man .. 🤪🤪🤪 https://t.co/plGzwCRsFf
— Ranganathan Madhavan (@ActorMadhavan) November 18, 2019
లైవ్ టీవి
Disha Case:తదుపరి ఆదేశాలిచ్చేవరకూ మృతదేహాలను...
13 Dec 2019 2:29 AM GMTకాస్త తగ్గిన పెట్రోల్ ధరలు..స్థిరంగా డీజిల్ ధర!
13 Dec 2019 2:02 AM GMTనిలకడగా బంగారం! భారీగా పడిపోయిన వెండి ధరలు!!
13 Dec 2019 1:42 AM GMTనాకు డైలాగులు ఎలా పలకాలో నేర్పించారు.. అయన నాకు గురువు :...
12 Dec 2019 5:22 PM GMTమరోసారి నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే...
12 Dec 2019 5:00 PM GMT