Raja Vikramarka Movie: తన సినిమా విడుదల తేదీని ప్రకటించిన కార్తికేయ

Hero Kartikeya Announced his Raja Vikramarka Movie Release Date
x

"రాజా విక్రమార్క" పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* కార్తికేయ నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Raja Vikramarka Movie: ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా వరుస సినిమాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఈ మధ్యనే కార్తికేయ "చావు కబురు చల్లగా" అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు "రాజా విక్రమార్క" అనే ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ సరిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఈ సినిమాలో కార్తికేయ ఒక కొత్త తరహా పాత్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ ఒక ఎన్ఐఏ ఆఫీసర్గా అందరి దృష్టిని ఆకట్టుకుబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల గురించి న ఒక ఆసక్తికరమైన వార్తని ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

రాజా విక్రమార్క సినిమా ఈ వచ్చే నెల అనగా నవంబర్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని పంచుకుంటూ ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని, ఇప్పటిదాకా తన కెరియర్ లో పోషించిన స్పెషల్ పాత్రలలో ఇది కూడా ఒకటి అని చెప్పుకొచ్చారు కార్తికేయ. తాన్య రవిచంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈమెకు ఇది మొదటి సినిమా. రామ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. పసుపతి, తనికెళ్ల భరణి, సాయి కుమార్, సుధాకర్ కోమాకుల మరియు హర్షవర్ధన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories