Madras Movie: ఏడేళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న కార్తీ సినిమా

admin1
Updated on: 23 Aug 2021 10:00 PM IST
Hero Karthi Tamil Movie Madras Releasing in Telugu Dubbing On This September 2021
X

కార్తీ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Madras Movie: ప్రస్తుతం తమిళ్ లో పాపులర్ దర్శకుల్లో ఒకరు అయిన పా రంజిత్ "అట్టకత్తి" సినిమాతో దర్శకుడిగా మారారు. తర్వాత రంజిత్ రెండో సినిమాతో స్టార్ దర్శకుడిగా మారారు. రంజిత్ కి అంత మంచి విజయాన్ని అందించిన సినిమా "మద్రాస్". కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో కేథరిన్ తెరెసా హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తమిళం లో అతి పెద్ద హిట్ గా నమోదైన "మద్రాస్" సినిమా 2014లోనే తెలుగులో కూడా డబ్ అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

ఆ తర్వాత అటకెక్కిన ఈ సినిమాని దాదాపు ఏడేళ్ళ తర్వాత మళ్లీ విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా తెలుగు డబ్బింగ్ వర్షన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల కాబోతోందని తెలియజేశారు. ఒరిజినల్ వెర్షన్ 2014లోనే విడుదల అయినప్పటికీ, తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోనే, విడుదల చేయటం విశేషం. డ్రీమ్స్ ఫ్యాక్టరీ, స్టూడియో గ్రీన్ మరియు కలసంఘం ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story