భాగమతి డైరెక్టర్ తో యువ హీరో హవీష్

Hero Havish Movie with Director Ashok | Tollywood News
x

భాగమతి డైరెక్టర్ తో యువ హీరో హవీష్

Highlights

*భాగమతి డైరెక్టర్ తో యువ హీరో హవీష్

Havish Movie: యువ హీరో హవీష్ నువ్విలా, జీనియస్, రామ్ లీలా, 7 వంటి సినిమాలలో ఇప్పటికే కనిపించి ప్రేక్షకులను అలరించారు. మంచి కథల ను ఎంచుకుంటూ కరియర్ లో ముందుకు దూసుకుపోతున్న హవీష్ మళ్లీ ఇప్పుడు ఒక విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఏ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా కి "ఎస్ బాస్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లోని మొదటి షెడ్యూల్ పూర్తయింది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆకుల శివ ఈ సినిమాకి కథ మరియు మాటలను అందిస్తున్నారు. కొన్ని చిన్న బడ్జెట్ తో మొదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఈ సినిమా కూడా అదే కోవకి చెందుతుందో లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని యువ హీరో హవీష్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories