Gopichand: కథ వినగానే ఓకే చెప్పేశా.. మొహమాటం కోసం చేయలేదు..

Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక మంచి హిట్ సినిమా కోసం గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 4 Jun 2022 6:30 PM IST
Hero Gopichand Speech at Pukka Commercial Movie Press Meet
X

Gopichand: కథ వినగానే ఓకే చెప్పేశా.. మొహమాటం కోసం చేయలేదు..

Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక మంచి హిట్ సినిమా కోసం గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" సినిమా తో బిజీగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై యూవీ వంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 1వ థియేటర్ లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ "నేను ఈ సినిమా చేయడానికి కారణం యూవీ వంశీ. జిల్ సినిమా తరువాత మంచి కథ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక రోజు వంశీ ఫోన్ చేసి మారుతి ఒక కథ చెబుతాడు విని ఎలా ఉందో చెప్పండి అన్నాడు. మారుతి ఫస్టాఫ్ చెప్పగానే సెకండాఫ్ కూడా చెప్పేయమని అడిగాను" అన్నారు గోపీచంద్.

"కథ అంతా విన్న తరువాత చాలా బాగుందని అన్నాను. నేనేదైనా మొహమాటం వల్ల ఓకే అన్నానేమో అనుకుని మళ్లీ వంశీగారు నన్ను కథ ఎలా ఉందండీ అని అడిగారు. నిజంగానే చాలా బాగుందండీ, తప్పకుండా చేద్దాం అని చెప్పాను. అలా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మారుతి ఈ సినిమా కి ముందు నాకు పరిచయం లేడు కానీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన తరువాత మాత్రం చాలా సన్నిహితుడితోనే కలిసి పని చేస్తున్నట్టుగా అనిపించింది. మా ఇద్దరి మధ్య మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. అరవింద్ గారు కనిపించినప్పుడల్లా టిప్స్ చెప్తూ ఉండేవారు. ఆయన బ్యానర్లో సినిమా చేయడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. బన్నీవాసు చేతిలో సినిమా పడితే సగం సక్సెస్ అయినట్టే" అని చెప్పుకొచ్చారు గోపీచంద్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story