Gopichand: తేజతో సినిమా గురించి స్పందించిన గోపీచంద్

* ఒక నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్నారు.

admin1
Updated on: 9 Oct 2021 11:46 AM IST
Hero Gopichand Clarifies That he is not Doing Movie With Director Teja
X

గోపీచంద్ (ట్విట్టర్ ఫోటో)

Gopichand: ఒక నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్, ఆరడుగుల బులెట్, పంతం, చాణక్య వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా మారడంతో గోపీచంద్ మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో "సీటీ మార్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "గౌతమ్ నంద" సినిమా తరువాత గోపీచంద్ మరియు సంపత్ నంది కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. తమన్నా మరియు దిగంగన సూర్యవంశీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరోవైపు మారుతి దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" అనే సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్న గోపీచంద్ తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి గోపీచంద్ కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా "జయం". అందులో విలన్ పాత్రలో గోపిచంద్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అయితే తేజ దర్శకత్వంలో ఈసారి గోపీచంద్ హీరోగా కనిపించబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తేజతో సినిమా అనుకున్న మాట నిజమే కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదని ప్రస్తుతం శ్రీవాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిపారు గోపీచంద్.

admin1

admin1

Next Story