Dhanush: అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్న ధనుష్.. అందుకు ఇప్పటికీ చింతిస్తున్నా..

Hero Dhanush Is Requesting Fans
x

Dhanush: అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్న ధనుష్

Highlights

Dhanush: అభిమానులకు అలా చేయొద్దు అని చెబుతున్న స్టార్ హీరో

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ఇప్పుడు తన కెరియర్ లోనే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "సార్" తో బిజీగా ఉన్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ద్విభాషా సినిమాగా ఈ సినిమా ఈనెల 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ధనుష్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేశారు. "లాక్ డౌన్ సమయంలో వెంకి అట్లూరి ఈ కథను వినిపించడానికి నన్ను కలిశారు. కానీ అప్పుడు నాకు స్క్రిప్ట్ వినే మూడ్ లేదు. నో చెప్పడం ఎందుకు అని పూర్తయ్యాక నో చెబుదామని అనుకున్నాను.

అయితే విచిత్రం ఏమిటంటే స్టోరీ వినడం అయిపోగానే నేను అతడిని అడిగిన మొదటి ప్రశ్న 'మీకు నా డేట్స్ ఎప్పుడు కావాలి'? అని. ఎందుకంటే కథకు మించి అందులో ఉన్న సందేశం నాకు చాలా బాగా నచ్చింది," అన్నారు ధనుష్. "విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యంతో సమానం సర్ పంచండి ఫైవ్ స్టార్ డిషెస్ లాగా అమ్మకండి, అని డైలాగ్ ను మీరు టీజర్ లో వినే ఉంటారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అదే. మంచి మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. 90 లో సాగే కథ ఇది. మమ్మల్ని చదివించడానికి మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కానీ చదువుకోవాల్సిన సమయంలో నేను అల్లరి పనులు చేస్తూ ఉండేవాడిని. చదువుకోకుండా ఒక అమ్మాయి కోసం ట్యూషన్ లో చేరాను.

టీచర్ ఎప్పుడు ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పలేకపోయేవాడిని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్ మానేశాను. ఒక స్నేహితురాలు కోసం బయట వేచి ఉండేవాడిని. ఆమెకి తెలియాలని బైక్ తో సౌండ్ చేసే వాడిని. దీంతో టీచర్ పై ఒకసారి మీరంతా చదువుకొని పరీక్షలు పాస్ అయి ఉన్నత స్థానంలో ఉంటే బయట బండితో శబ్దాలు చేస్తూ వాడు వీధుల్లో డాన్స్ లు చేసుకోవాల్సిందే అని అక్కడ ఉన్న వారితో అన్నారట. ఆయన చెప్పినట్టు తమిళనాడులో నేను డాన్స్ చేయని వీధి అంటూ లేదు," అంటూ నవ్వేశారు ధనుష్. కానీ వెనక్కి తిరిగి చూస్తే నేను ఎందుకు క్లాసెస్ అటెండ్ అవ్వలేదు అని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. జీవితంలో చదువు చాలా ఇంపార్టెంట్. మీరు నాలాగా చేయకండి," అని ధనుష్ అభిమానులను రెక్వెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories