Bellamkonda Srinivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ!

Bellamkonda Srinivas : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్ .. వివి వినాయక్

Krishna
Published on: 3 Sept 2020 4:05 PM IST
Bellamkonda Srinivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ!
X

Bellamkonda Srinivas

Bellamkonda Srinivas : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్ .. వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు ఏడూ సినిమాలను చేశాడు.. ఇందులో అయన ఏడో సినిమాగా వచ్చిన రాక్షసుడు చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.. తమిళంలో హిట్టైన రాక్షసన్ సినిమాకు ఇది రీమేక్..

అయితే ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.. అయితే అది తెలుగులో కాదు లెండి.. హిందీ వెర్షన్ లో.. అంతేకాకుండా గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమాని హిందీలో ఖూంఖర్ పేరతో డబ్ చేస్తే యూట్యూబ్ లో 300 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక అల్లుడు శీను 100 మిలియన్ వ్యూస్ సాధించాయి. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేని ఈ సినిమాలు హిందీలోకి డబ్ అయి యూట్యూబ్ లో భారీ వ్యూస్ దక్కించుకోవడం విశేషం..

రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టిన శ్రీనివాస్ ఆ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో సినిమాని చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా కి 'అల్లుడు అదుర్స్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం త్వరలో సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్దం అయింది. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . డూడ్లే ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Krishna

Krishna

Next Story