Balakrishna Donation : పెద్ద మనసు చాటుకున్న బాలయ్య.. కోవిడ్ సెంటర్ కి భారీ విరాళం!

Balakrishna Donation : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

Krishna
Published on: 24 Aug 2020 10:28 AM IST
Balakrishna Donation : పెద్ద మనసు చాటుకున్న బాలయ్య.. కోవిడ్ సెంటర్ కి భారీ విరాళం!
X

balakrishna

Balakrishna Donation : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక గతంతో పోల్చుకుంటే కరోనా కేసులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు.. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి పాజిటివ్ కేసులలో ఏపీ రెండో స్థానంలో ఉంది.. దీనితో కరోనా కట్టడికి అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు.. కరోనా చర్యల్లో ఉపయోగించే పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు పెద్ద ఎత్తున అవసరమవుతున్నాయి.

ఈ క్రమంలో హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజక వర్గంలో కరోనాకు సంబంధించిన వివరాలను తెలుసుకొని హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు 55 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.. కరోనా వైరస్ నివారణకై ఉపయోగించే మందులు, కావాల్సిన పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర అన్ని పరికరాలను అందించడానికి ఈ విరాళాన్ని ప్రకటించారు బాలయ్య.. ఇక అంతకుముందు బాలకృష్ణ కరోనా కట్టడికి గాను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకి చెరో 50 లక్షలను ప్రకటించారు.. అంతేకాకుండా సినీ కార్మికుల కోసం 25 లక్షల విరాళం అందించాడు..

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు.. ఇది వీరిద్దరికీ మూడో సినిమా.. గతంలో వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ హట్రిక్ మూవీకి గాను మోనార్క్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది..

Krishna

Krishna

Next Story